Photo Credit: BCCI Twitter
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్న షో పేరు "ఫ్యామిలీ ఫుల్‌హౌస్ విత్ రోహిత్ శర్మ". ఈ షోలో మల్టీ జనరేషన్ టీమ్స్ పాల్గొననున్నాయి.
ఇప్పటిదాకా మైదానంలో బ్యాట్ పట్టి అభిమానులను అలరించిన హిట్‌మ్యాన్ ఇకపై గ్రీన్ మ్యాట్‌పై షోకు విచ్చేసే కుటుంబాలు చెప్పే కథలను కెమెరా, లైటింగ్ మధ్య విననున్నాడు. స్వతహాగా మంచి మాటకారి అయిన రోహిత్‌ను షోకు హోస్ట్‌గా ఎంపిక చేయడంతోనే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ సగం విజయం సాధించేసింది. ఇక రోహిత్ తన కామెడీ టైమింగ్‌తో షోను ఎంత మేర నడిపిస్తాడనేది చూడాలి.
ఇప్పటికే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో కట్స్, అందులో రోహిత్ చేస్తున్న అల్లరి అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చేయబోయే పని కూడా ఇదేనని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ రోహిత్ శర్మకు చివరి టోర్నీ అయ్యే అవకాశం లేకపోలేదు. కాగా రోహిత్ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో ఉంటాడని, అతడి గురించి అనవసర ఊహాగానాలు చేయడం ఆపేయాలని హితవు పలికాడు.
ఇక రోహిత్ శర్మ టీమిండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 175 పరుగులు చేశాడు.
Garden Se Reporting Live, Jersey No. 45 😉
Family Full House With Rohit Sharma!
Shuru ho raha hai 19th September se, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.
#RohitSharma#FamilyFullHouse#ComingSoon #SonyTV@ImRo45 pic.twitter.com/DGWRp6Epzv— sonytv (@SonyTV) September 5, 2026
చదవండి: భారత్‌తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్


