ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా? | Mayank Agarwal falls for 25-ball duck to 19-year-old in County Championship 2026 | Sakshi
Sakshi News home page

ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా?

Sep 9 2026 1:07 PM | Updated on Sep 9 2026 2:06 PM

Mayank Agarwal falls for 25-ball duck to 19-year-old in County Championship 2026

ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ డివిజ‌న్‌-2లో డ‌ర్హ‌మ్ త‌ర‌పున ఆడుతున్న భార‌త వెట‌ర‌న్ మయాంక్ అగర్వాల్ అంతంత‌మాత్రంగానే రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదిక‌గా మిడిలెక్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ తీవ్ర నిరాశపరిచాడు. సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అగర్వాల్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. 

25 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్‌.. తన ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 19 ఏళ్ల మిడిలెక్స్‌ బౌలర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 35 ఏళ్ల మయాంక్ అగర్వాల్ చివరిగా 2022లో శ్రీలంకపై చివరి మ్యాచ్ ఆడాడు. 

మొత్తంగా అతడు భారత జట్టుకు 21 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఇన్నింగ్స్‌లలో అగర్వాల్ 41.33 సగటుతో 1,488 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి కెరీర్ బెస్ట్ స్కోర్ 243 పరుగులగా ఉంది.

ఈ డబుల్ సెంచరీని 2019లో హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై సాధించాడు. ఐపీఎల్‌-2026లో కూడా అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అంతకుముందు సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అగర్వాల్ ఆడాడు.
చదవండి: పాపం తిలక్‌ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement