యూపీ టీ20 లీగ్-2026 విజేతగా రింకూ సింగ్ సారధ్యంలోని మీరట్ మేవరిక్స్ నిలిచింది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో లక్నో ఫాల్కన్స్‌ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన మీరట్.. రెండో యూపీ టీ20 టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ దివ్యాన్ష్ జోషి(40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105) విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్‌లో 2 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ మూడు, భువనేశ్వర్ కుమార్, అజిత్ వర్మ, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విశాల్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు.
కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?
ఇక మీరట్‌ను జట్టును రెండో సారి ఛాంపియన్‌గా నిలపడంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ దూసుకొచ్చాడు. గత రెండు సీజన్‌లలో అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అయితే అతడు ఇటీవల ఆల్‌ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోల్‌కతా కెప్టెన్సీ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది.
దీంతో కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల బట్టి తదుపరి కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌నే ఎంపిక చేసే అవకాశముంది. అతడు ఈ యూపీ టీ20 లీగ్‌లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్‌ప్లాప్ ప్లేయర్‌కు చోటు


