సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2023 నుంచి కనీసం ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్‌ను సాధించలేదు.
అయినప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచుతున్నారు. ప్రోటీస్ సిరీస్‌లో కూడా విఫలమైతే అతడిని పూర్తిగా జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది. ఇక సౌతాఫ్రికా కండీషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలర్లకు సెలక్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.
అదేవిధంగా యువ ఆటగాళ్లు కూపర్ కానలీ, మాథ్యూ కుహ్నెమాన్‌లు కూడా ప్రోటీస్ టూర్‌కు ఎంపికయ్యారు. కాగా 2018లో జరిగిన వివాదాస్పద సిరీస్ తర్వాత ఆసీస్ టెస్టు మ్యాచ్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్మిత్ మరియు రెన్‌షా - మాత్రమే పర్యటన జట్టులో చోటు దక్కించుకున్నారు.
2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి పర్యటనలో ఉన్న పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్, స్మిత్, రెన్‌షా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్
చదవండి: 'టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్‌కు శాపంగా మారింది'


