క్రికెట్‌ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా | India To Face Japan In Historic T20I Match | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా

Sep 4 2026 6:32 PM | Updated on Sep 4 2026 6:54 PM

India To Face Japan In Historic T20I Match

ఏషియన్ గేమ్స్-2026 ఆరంభానికి ముందే భారత క్రికెట్ జట్టు ఒక చారిత్రక మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జపాన్‌తో ఏకైక టీ20లో టీమిండియా తలపడనుంది. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ  శుక్రవారం 'ఎక్స్'  వేదికగా వెల్లడించింది.

"ఒలింపిక్స్-20236, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులకోసం ప్రయత్నిస్తున్న భారత్‌ ఆ దిశగా ‘స్పోర్ట్స్ 75’తో తొలి అడుగు వేయనుంది. జ‌పాన్‌తో భార‌త్ ప్ర‌త్యేక మ్యాచ్ ఆడ‌నుంది. జపాన్ ప్రధాని సనాయె తకైచి, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీల మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. 

ఇండియా, జపాన్ మధ్య క్రీడల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రేయస్‌ అయ్యర్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్‌ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలకు బీసీసీఐ పూర్తి స్ధాయి భారత జట్టును పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏషియన్‌ గేమ్స్‌ సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
చదవండి: సాఫ్ట్​వేర్​ ఇంజినీర్‌ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. ఎవరీ నయా సంచలనం?



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement