ఐర్లాండ్‌ చేతిలో భారత్ ఓడిపోలేదా?.. అంత‌మాత్రాన క్రికెట్ అగిపోయిందా? | Mohsin Naqvi invokes Indias loss to Ireland to defend Pakistan cricket amid backlash | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌ చేతిలో భారత్ ఓడిపోలేదా?.. అంత‌మాత్రాన క్రికెట్ అగిపోయిందా?

Sep 3 2026 1:19 PM | Updated on Sep 3 2026 1:47 PM

Mohsin Naqvi invokes Indias loss to Ireland to defend Pakistan cricket amid backlash

పాకిస్తాన్ క్రికెట్‌లో ప్ర‌స్తుతం తీవ్ర సంక్షోభం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌లో వ‌రుస‌గా రెండు టెస్టుల్లో ఘోర ఓట‌మి చ‌విచూడడంతో పాక్ జ‌ట్టులో కొన్ని అనుహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుకు ముందు జ‌ట్టులోని మొత్తం ఏడు మంది ఆట‌గాళ్ల‌ను పాక్ క్రికెట్ బోర్డు స్వ‌దేశానికి ర‌ప్పించింది. 

అక్క‌డితో ఆగ‌కుండా కోచ్‌లు స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, ఉమ‌ర్ గుల్‌ను సైతం వెనక్కి పిలిపించింది. మ‌రోవైపు స్టార్ బ్యాట‌ర్ ఇమామ్-ఉల్-హ‌క్ ఫేక్ ఇంజ్యూరీ వివాదం కూడా క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 

అయితే తమ సొంత జట్టులోని లోపాలను సరిదిద్దుకోలేని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇతర జట్లపై తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక క్రికెట్‌లో ఎంతటి బలమైన జట్లయినా ఊహించని ఓటములను చవిచూడటం సాధారణ విషయమని తమ లోపాలను అతడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు.

"మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. సౌతాఫ్రికా నమీబియా చేతిలో, భారత్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అంతమాత్రాన అక్కడితో క్రికెట్ ముగిసిపోయిందా? క్రికెట్‌లో గెలుపుటుముల సహజం. మాకు ఎవరైతే అవసరమో వారిని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం. అంతే తప్ప వరుసగా విఫలమమ్యే వారిని ఇకపై జట్టులో కొనసాగించాం. మాకు ప్రతీ మ్యాచ్‌, ప్రతీ సిరీస్ కూడా చాలా ముఖ్యమని" అతడు పేర్కొన్నాడు.

అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనలో తమ జట్టు ప్రదర్శన గురుంచి కూడా అతడు మాట్లాడు. "ఇంగ్లండ్ టూర్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. కానీ రాబోయో మ్యాచ్‌లు, సిరీస్‌లలో మేము తిరిగి పుంజుకుంటామని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే వన్డే, టీ20ల్లో మా విజయాల శాతం పెరిగింది. నేను విమర్శలకు భయపడను. 

నేను వచ్చిన తర్వాత పాక్ క్రికెట్ నాశనం అయిపోయిందన్న అన్న వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను కొత్త కోచ్‌లను తీసుకురాకముందు మన జట్టు ర్యాంకింగ్స్‌లో ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. వన్డేల్లో 8వ స్ధానంలో ఉండేవాళ్లం.. ఇప్పుడు ఐదవ ర్యాంక్‌లో ఉన్నాము. అలాగే టీ20ల్లో తొమ్మిది నుంచి ఆరవ స్ధానానికి ఎగబాకాము" అని నఖ్వీ చెప్పుకొచ్చారు.
చదవండి: 'హమ్మయ్య.. గంభీర్‌ ఫేవరెట్ ప్లేయర్లు వచ్చేశారు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement