డుప్లెసిస్‌ విధ్వంసం.. అశ్విన్‌ టీమ్‌కు నాలుగో ఓటమి | Faf du Plessis Stars As Rotterdam Dockers To Victory Over Ashwin Led Dublin Guardians In ETPL, Read Story Inside | Sakshi
Sakshi News home page

డుప్లెసిస్‌ విధ్వంసం.. అశ్విన్‌ టీమ్‌కు నాలుగో ఓటమి

Sep 3 2026 9:12 AM | Updated on Sep 3 2026 9:49 AM

Faf du Plessis Stars as Rotterdam Dockers Chase Down Dublin Guardians in ETPL

యూరోపియ‌న్ టీ20 ప్రీమియ‌ర్ లీగ్‌లో రవిచంద్ర‌న్ అశ్విన్ సార‌థ్యంలోని డబ్లిన్ గార్డియన్స్ ఓటముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. బుధవారం రోటర్‌డామ్ డాకర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో డ‌బ్లిన్ ప‌రాజ‌యం పాలైంది. డ‌బ్లిన్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సంజయ్ కృష్ణమూర్తి(26), విజయ్‌ శంకర్‌(26) రాణించారు. 

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సంజయ్ కృష్ణమూర్తి(26), విజయ్‌ శంకర్‌(26) రాణించారు.

రోటర్‌డామ్ బౌలర్లలో రోలోఫ్ వాన్ డర్ మెర్వే రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్‌ వీస్‌,  నోకియా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని రోటర్‌డామ్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.  

కేవలం 51 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 79 పరుగులు చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌(28 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 34), మైఖేల్ లెవిట్(35) రాణించారు. డబ్లిన్‌ బౌలర్లలో లిటిల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌ ఓ వికెట్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement