డబ్లిన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు | YSR Birth Anniversary Celebrated Grandly in Dublin by YSRCP Ireland | Sakshi
Sakshi News home page

డబ్లిన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Jul 12 2026 4:19 AM | Updated on Jul 12 2026 4:22 AM

YSR Birth Anniversary Celebrated Grandly in Dublin by YSRCP Ireland

దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, వైఎస్సార్ జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఆలూరి సాంబశివ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి హాజరై, వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను పంచుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని అందరికీ చేరవేస్తూ, పార్టీ ఆశయాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement