దాడితో మొదలైన విధ్వంసం.. ఇంతలో దౌత్య చర్చలు! | US Strikes Iran After Shipping Attack; Strait of Hormuz Closed | Sakshi
Sakshi News home page

దాడితో మొదలైన విధ్వంసం.. ఇంతలో దౌత్య చర్చలు!

Jul 12 2026 7:40 AM | Updated on Jul 12 2026 7:40 AM

US Strikes Iran After Shipping Attack; Strait of Hormuz Closed

వాషింగ్టన్: హార్ముజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘ఎమ్/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) దాడికి పాల్పడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా, ఇరాన్‌పై శనివారం మూడో విడత సైనిక దాడులకు దిగింది. ఐఆర్జీసీ దాడి వల్ల నౌక ఇంజన్ గది తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగడంతో ప్రయాణానికి వీలులేకుండా పోయిందని, ఒక సిబ్బంది గల్లంతయ్యారని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు సెంట్‌కామ్ పేర్కొంది.

‘ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తోంది’ అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ హెచ్చరించారు. మరోవైపు, పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది. తమపై మరిన్ని దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖతార్, ఒమన్ దేశాలు ఇరాన్‌తో ముమ్మర దౌత్య చర్చలు జరుపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement