యూరోపియ‌న్ లీగ్‌లో ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ విధ్వంసం | Star Player From-Mumbai Indians-5-Wicket Haul-European T20 League | Sakshi
Sakshi News home page

యూరోపియ‌న్ లీగ్‌లో ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ విధ్వంసం

Aug 31 2026 2:44 PM | Updated on Aug 31 2026 2:54 PM

Star Player From-Mumbai Indians-5-Wicket Haul-European T20 League

Photo Credit: Twitter

యూరోపియ‌న్ టీ20 ప్రీమియ‌ర్ లీగ్ (ఈటీపీఎల్‌-2026)లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ మిచెల్ సాంట్న‌ర్ త‌న ప్ర‌ద‌ర్శ‌నతో అద‌ర‌గొడుతున్నాడు. బౌలింగ్‌లో 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన సాంట్న‌ర్ 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. ఫ‌లితంగా ఎడిన్‌బ‌ర్గ్ కాసిల్ రాక‌ర్స్ 4 వికెట్ల తేడాతో డ‌బ్లిన్ గార్డియ‌న్స్‌పై గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన డ‌బ్లిన్ గార్డియ‌న్స్ 18 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ జేమ్స్ విన్స్ (40), సంజ‌య్ కృష్ణ‌మూర్తి (24) మిన‌హా మిగ‌తావారు రాణించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ ఐదు వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు ప‌డగొట్టాడు. అనంత‌రం ఛేద‌న‌ను ఆరంభించిన ఎడిన్‌బ‌ర్గ్ కాసిల్ రాక‌ర్స్ 13.4 ఓవ‌ర్ల‌లోనే 6 వికెట్లు కోల్పోయి 110 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

ఓపెన‌ర్లు రాస్ అడైర్ (24), జేజే స్మ‌ట్స్ (33) రాణించగా, ఆఖ‌ర్లో లారి ఎవ‌న్స్ (19), గారెత్ డెలాని (10) ధాటిగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఈ సీజ‌న్‌లో ఎడిన్‌బ‌ర్గ్ త‌ర‌ఫున సాంట్న‌ర్‌కు ఇది రెండో ఐదు వికెట్ల హాల్ కావ‌డం విశేషం.

Read: వాళ్లతో పోటీ ఏంటి?: పాక్‌ పరువు తీసిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement