Photo Credit: BCCI Twitter
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్ వుమెన్‌తో మ్యాచ్‌కు ముందే భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్ దీప్తి శర్మకు 150వ టీ20 కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మహిళల క్రికెట్‌లో 150 టీ20 ఆడిన మూడో ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (202 మ్యాచ్‌లు), స్మృతి మంధన (171 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒక ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన 12వ క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇప్పటివరకు దీప్తి శర్మ 149 టీ20 మ్యాచ్‌ల్లో 1270 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 168 వికెట్లు పడగొట్టింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.
From 1st T20I to 1⃣5⃣0⃣th 🙌
From a young debutant to an experienced all-rounder 👌
Deepti Sharma is all set for a special game today 🤗 - By @mihirlee_58#TeamIndia | #WomensAsiaCup | @Deepti_Sharma06 pic.twitter.com/73HWwNQyUr— BCCI Women (@BCCIWomen) August 30, 2026


