గంటలోనే టికెట్లు ఖతం.. బ్రెజిల్‌-భారత్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఫుల్‌ డిమాండ్‌ | india vs brazil football match tickets sold out in hours | Sakshi
Sakshi News home page

గంటలోనే టికెట్లు ఖతం.. బ్రెజిల్‌-భారత్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఫుల్‌ డిమాండ్‌

Sep 3 2026 8:33 AM | Updated on Sep 3 2026 8:33 AM

india vs brazil football match tickets sold out in hours

భారత్, బ్రెజిల్‌ అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అక్టోబర్‌ 3న కోల్‌కతా వేదికగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌తో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రాథమిక ధర టికెట్లన్నీ బుధవారం గంటలోనే అమ్ముడవడం విశేషం. 

ఫుట్‌బాల్‌ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు బ్రెజిల్‌తో మ్యాచ్‌ ఆడలేదు. దీంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆతృత కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల ధరలను రూ. 999 నుంచి రూ. 15,000గా నిర్ణయించారు. వివేకానంద యువ భారతి మైదాన సామర్థ్యం 67,000 కాగా... టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. 

ఇందులో రూ.999, రూ.2,000, రూ. 3,500, రూ. 4,500, రూ. 6,000, రూ. 7,000, రూ. 9,000, రూ. 15,000 టికెట్లు అమ్మకానికి ఉన్నాయిరు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచి్చన గంట వ్యవధిలోనే ప్రాధమిక ధర టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. 

ఈ నెల 26న బెంగళూరు వేదికగా పనామాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాత బ్రెజిల్, ఉరుగ్వే (అక్బోబర్‌ 6న) స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం భారత హెడ్‌ కోచ్‌ ఖాలిద్‌ జమీల్‌ ఇప్పటికే 26 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. వీరంతా ఈ నెల 14 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న జాతీయ శిబిరంలో పాల్గొననున్నారు. పనామాతో పోరు అనంతరం ఈ నెల 28న భారత జట్టు కోల్‌కతా చేరుకోనుంది.
చదవండి: గాయమంటూ నాటకం? పాక్‌ స్టార్‌ బ్యాటర్‌పై రెండేళ్ల నిషేధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement