పెద్దోడి మెరుపులు.. వణికిపోయిన సీఎస్‌కే బౌలర్‌ | CSK bowler gets smashed for 4 consecutive boundaries by Rahkeem Cornwall | Sakshi
Sakshi News home page

CPL 2026: పెద్దోడి మెరుపులు.. వణికిపోయిన సీఎస్‌కే బౌలర్‌

Sep 3 2026 11:17 AM | Updated on Sep 3 2026 11:31 AM

CSK bowler gets smashed for 4 consecutive boundaries by Rahkeem Cornwall

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జ‌ట్టు మ‌రో  విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకుంది. బుధ‌వారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 8 ప‌రుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  బార్బుడా ఫాల్కన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంటిగ్వాకు బిగ్‌మ్యాన్‌ రకీమ్ కార్న్‌వాల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌ వేసిన సీఎస్‌కే స్పిన్నర్‌, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్టార్‌ అకీల్‌ హోసేన్‌ను కార్న్‌వాల్‌ ఉతికారేశాడు. వరుసగా 4 ఫోర్లు బాది 16 పరుగులు పిండుకున్నాడు. అనంతరం లక్ష్య చేదనలో టీకేఆర్‌ 7 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేయగల్గింది. 

రకీమ్‌ కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు. మూడు ఓవర్లు వేసిన రకీమ్‌.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జేమ్స్‌ రెండు వికెట్లు సాధించాడు. టీకేఆర్‌ బ్యాటర్లలో జాషువా డిసిల్వా(54), పొలార్డ్‌(41) రాణించారు.
చదవండి: 'హమ్మయ్య.. గంభీర్‌ ఫేవరెట్ ప్లేయర్లు వచ్చేశారు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement