సౌతాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో | Quinton de Kocks Century in Vain as St Kitts And Nevis Patriots Hand Barbados Royals Hat-Trick of Defeats | Sakshi
Sakshi News home page

CPL 2026: సౌతాఫ్రికా ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో

Sep 2 2026 9:36 AM | Updated on Sep 2 2026 10:36 AM

Quinton de Kocks Century in Vain as St Kitts And Nevis Patriots Hand Barbados Royals Hat-Trick of Defeats

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌-2026లో బార్బడోస్ ట్రైడెంట్స్ హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. వార్నర్ పార్క్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బార్బడోస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రైడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

ట్రైడెంట్స్ బ్యాటర్లలో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు. కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు,6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు జాకరీ కార్టర్(57) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో నసీం షా రెండు వికెట్లు పడగొట్టాడు.

చార్లెస్‌ మెరుపులు
అనంతరం 218 పరుగుల లక్ష్యాన్ని సెయింట్‌ కిట్స్‌ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఓపెనర్‌ జాన్సెన్‌ చార్లెస్‌(45 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు షనక(36), మైర్స్‌(29) రాణించారు. 

బార్బడోస్ బౌలర్లలో సామ్స్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టగా.. మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. బార్బడోస్ ఈ ఓటమితో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ట్రైడెంట్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs AFG: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement