ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్! | Krunal Pandya Reacts Cryptically After Missing India’s T20I Squad For Afghanistan Series, Check Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AFG: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్!

Sep 2 2026 8:01 AM | Updated on Sep 2 2026 10:11 AM

Krunal Pandya Cryptic Post After Afghanistan T20I Squad Snub Goes Viral

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం భారత వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేయగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు సంపాదించుకున్నారు. 

ఈ క్రమంలో భారత జట్టును ప్రకటించిన అనంతరం కృనాల్ సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్  స్టోరీని షేర్ చేశాడు. భారత జెండా ఎమోజీలను జత చేస్తూ.. "ఆశ ఇంకా సజీవంగానే ఉంది" అని అతడు పోస్ట్ చేశాడు. కృనాల్ పాండ్యా చివరిసారిగా భారత్ తరపున 2021లో ఆడాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు ఐదు వ‌న్డేలు, 19 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

వ‌న్డేల్లో అత‌డి అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 58 కాగా.. టీ20ల్లో 26 ప‌రుగులగా ఉంది. మొత్తంగా అత‌డు రెండు ఫార్మాట్ల‌లో క‌లిపి 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, ఐదేళ్ల తర్వాత కృనాల్‌ను తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ సెలక్టర్లు మాత్రం అతడివైపు మొగ్గు చూపలేదు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించికపోతే అతడి స్ధానంలో కృనాల్ పేరును పరిశీలించే అవకాశముంది.

భార‌త జ‌ట్టు: శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా*, అర్ష‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రానా*
చదవండి: ప్రిటోరియస్‌ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement