Photo Credit: Twitter
ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా విండ్‌హక్ వేదికగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఓపెనర్ లుహాన్ ప్రిటోరియస్ (51 బంతుల్లో 94; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, డెవాల్డ్ బ్రెవిస్ (41) మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. జోర్డాన్ హెర్మన్ (28) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో వెస్లే మధవెరె 3 వికెట్లు తీయగా, బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (45) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇన్నోసెంట్ కాయా (18), నైమూరి (27) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జోర్న్ ఫోర్టున్ 4 వికెట్లు తీయగా, డాన్ జాసన్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి పట్టికలో టాప్‌లో ఉండగా, జింబాబ్వే మూడింటిలో రెండు ఓడి మూడో స్థానంలో ఉంది. ఇక నమీబియా 2 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.
South Africa make it two wins over Zimbabwe in three days, cruising to a 43-run win in Windhoek.
Lhuan-dre Pretorius smashed a career-best 94 👏 pic.twitter.com/lxcsc2Idpb— Cricbuzz (@cricbuzz) September 1, 2026


