కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా త్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా కింగ్స్‌మెన్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జమైకా యువ స్పిన్నర్ విటెల్ లాస్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ బౌలింగ్‌తో క్రిస్ మున్రో, కిరాన్ పొలార్డ్ వంటి దిగ్గజ క్రికెటర్లను బోల్తా కొట్టించాడు.
నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన లాస్.. తొలి బంతికి మున్రోను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బంతికి పొలార్డ్‌ను అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూ ట్రంప్‌ను కూడా చివరి బంతికి లాస్ వెనక్కి పంపాడు. 19 ఏళ్ల లాస్ ఆ ఓవర్‌లో కనీసం ఒక్క పరుగు కూడా ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు.
తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 'ట్రిపుల్-వికెట్ మైడెన్ ఓవర్' నమోదు చేసిన తొలి విండీస్ స్పిన్నర్‌గా లాస్ రికార్డులకెక్కాడు. సునీల్ నరైన్ లాంటి అగ్రశ్రేణి స్పిన్నర్‌కు కూడా ఈ రికార్డ్ సాధ్యంకాలేదు. ఇక ఓవరాల్‌గా సీపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా లాస్ నిలిచాడు. అతడి కంటే ముందు షకీబ్ అల్ హసన్,కెస్రిక్ విలియమ్స్, వహాబ్ రియాజ్ ఈ ఘనత సాధించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో లిన్ మున్రో (52), కెప్టెన్ నికోలస్ పూరన్(60), సునీల్ నరైన్( 53) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా కూడా ధీటుగా బదులిచ్చింది. 14.4 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ సమయంలో వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో జమైకాను విజేతగా ప్రకటించారు.
చదవండి: 15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ


