ధోనిని తలపిస్తూ సీఎస్‌కే ఆటగాడి హెలికాప్టర్ షాట్‌! వీడియో | Prashant Veer Lights Up UP T20 League 2026 With Stunning MS Dhoni Style Helicopter Shot, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ధోనిని తలపిస్తూ సీఎస్‌కే ఆటగాడి హెలికాప్టర్ షాట్‌! వీడియో

Aug 30 2026 12:09 PM | Updated on Aug 30 2026 1:23 PM

Prashant veer stunningly replicates MS Dhonis iconic helicopter shot for Noida Super Kings in UP T20 League

యూపీ టీ20 లీగ్‌-2026లో కాన్పూర్ సూపర్ స్టార్స్ ఎట్ట‌కేల‌కు తిరిగి గెలుపు బాట‌ప‌ట్టింది. శ‌నివారం గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక‌గా నోయిడా సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కాన్పూర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నోయిడా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. 

నోయిడా బ్యాటర్లలో ప్రశాంత్‌ వీర్‌(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. ఐదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రశాంత్ వీర్‌.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడు సీఎస్‌కే లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేస్తూ హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రశాంత్‌ వీర్‌ కూడా ఐపీఎల్‌లో సీఎస్‌కేకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

సమీర్ రిజ్వీ విధ్వంసం
అనంతరం 129 పరుగుల లక్ష్యాన్ని కాన్పూర్ సూపర్ స్టార్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ సంచలనం సమీర్‌ రిజ్వీ విధ్వంసం సృష్టించాడు. 

39 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్‌ పాండే 31 పరుగులతో రాణించాడు. కన్పూర్‌ బౌలింగ్‌లో కునాల్‌ త్యాగీ, ప్రశాంత్‌ వీర్‌ తలా వికెట్‌ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: గంభీర్‌ సంచలన నిర్ణయం.. డేంజర్‌లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement