ధోనీకి మూడో స్థానమా? క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన క్లాసెన్! | MS Dhoni Shockingly Given 3rd Spot In Best Wicketkeepers Of All Time | Sakshi
Sakshi News home page

ధోనీకి మూడో స్థానమా? క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన క్లాసెన్!

Aug 25 2026 11:45 AM | Updated on Aug 25 2026 11:47 AM

MS Dhoni Shockingly Given 3rd Spot In Best Wicketkeepers Of All Time

సౌతాఫ్రికా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026 తొలి సీజ‌న్‌కు స‌న్న‌ద‌మ‌వుతున్నాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఓ బ్లైండ్ ర్యాంకింగ్ ఛాలెంజ్‌లో క్లాసెన్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో టాప్‌-5 వికెట్ కీప‌ర్ల‌ను క్లాసెన్ ఎంచుకున్నాడు.

అత‌డు ఈ జాబితాలో త‌న దేశానికే చెందిన దిగ్గ‌జ క్రికెట‌ర్‌ ఏబీ డివిలియ‌ర్స్‌కు అగ్ర‌స్ధానం కేటాయించాడు. ఆ త‌ర్వాత స్ధానం ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌కు  ఇచ్చాడు. అయితే క్లాసెన్ భార‌త మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోనికి మూడో స్ధానం కేటాయించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

ఎందుకంటే ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్ల‌లో ధోని ఒక‌డు. మెరుపు వేగంతో చేసే స్టంపింగ్స్, రన్ అవుట్‌లు మరొకరికి  అసాధ్య‌మనే చెప్పాలి. వికెట్ల వెన‌క ఉండి త‌న మాస్ట‌ర్ మైండ్‌తో గేమ్ స్వరూపాన్నే మార్చే స‌త్తా అత‌డిది. ఇక నాలుగో స్ధానంలో ఆసీస్ దిగ్గ‌జ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌కు క్లాసెన్ చోటు క‌ల్పించాడు. ఈ స‌న్‌రైజ‌ర్స్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ చివ‌రి స్దానం త‌న‌కు తానే కేటాయించుకున్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ ఎంపిక‌ చేసిన ఆల్ టైమ్ అత్యుత్తమ వికెట్ కీపర్లు
ఏబీ డివిలియర్స్
జోస్ బట్లర్
ఎంఎస్ ధోని
ఆడమ్ గిల్‌క్రిస్ట్
హెన్రిచ్ క్లాసెన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement