శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మైండ్ గేమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. లంక ఓపెనర్ కమిల్ మిషారాను మాటలతో రెచ్చగొట్టి, అతడి సహనాన్ని పరీక్షించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మిషారా అనవసరమైన షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు.
సిరాజ్ మాటలకు మిషారా స్పందన
శ్రీలంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్ వెలుపల పడి బ్యాటర్‌కు దూరంగా వెళ్లింది. మిషారా దాన్ని వదిలేశాడు.
అయితే అదే ఓవర్‌లో వరుసగా రెండోసారి బంతిని వదిలేయడంతో సిరాజ్ మిషారాతో కొన్ని మాటలు మాట్లాడాడు. బంతిని వదిలేయకుండా షాట్ ఆడేలా అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మిషారా మాత్రం తొలుత చిరునవ్వుతోనే స్పందించాడు.
అయితే సిరాజ్ మాటలు మిషారా ఆలోచనల్లో ప్రభావం చూపినట్లు తర్వాతి పరిణామాలను బట్టి కనిపించింది.
— crictalk (@crictalk7) August 25, 2026
ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..!
సిరాజ్ ఓవర్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బంతిని అందుకున్నాడు. అతను పైకి లేపిన బంతిని మిషారా ఎదుర్కొన్నాడు. వాస్తవానికి ఆ బంతిని వదిలేయడం సురక్షితమైన నిర్ణయం. కానీ మిషారా డిఫెన్సివ్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బ్యాట్‌తో తాకించాడు. ఫలితంగా భారత జట్టుకు కీలక వికెట్ లభించింది. ఈ తంతు పరిశీలిస్తే సిరాజ్ ముందు ఓవర్‌లో చేసిన స్లెడ్జింగ్ వర్కౌటైనట్లు కనిపించింది.
Prasidh Krishna loves striking early! 🔥🎯#PrasidhKrishna #SLvsIND
pic.twitter.com/gzd7dSWZuJ— OneCricket (@OneCricketApp) August 25, 2026
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు తొలి సెషన్ సమయానికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పసిందు సూరియబండార (41), కమిందు మెండిస్ (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు చేసింది.
చదవండి: జురేల్ జిగేల్...


