కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సెంచరీతో మెరిశాడు. ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జురుల్.. 171 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ యూపీ క్రికెటర్ 106 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ఈ క్రమంలో జురెల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు క్రికెట్‌లో ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత్ ప్లేయర్‌గా జురెల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది.
2010లో ఇదే కొలంబో మైదానంలో ధోని ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి 76 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును జురుల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా శ్రీలంకలో ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ధ్రువ్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 2017లో హార్దిక్ పాండ్యా నంబర్ 7 పొజిషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టు సెంచరీ సాధించాడు.
చదవండి: IND vs SL: శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. జైశ్వాల్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ


