వైభ‌వ్ సూర్య‌వంశీ ప్లాఫ్ షో వెనుక కార‌ణ‌మిదే? | Fans Troll-Vaibhav-Failure-Jersey Number-Changed-Covered-With-Tape | Sakshi
Sakshi News home page

వైభ‌వ్ సూర్య‌వంశీ ప్లాఫ్ షో వెనుక కార‌ణ‌మిదే?

Aug 24 2026 4:44 PM | Updated on Aug 24 2026 5:17 PM

Fans Troll-Vaibhav-Failure-Jersey Number-Changed-Covered-With-Tape

Photo Credit: Twitter

దులీప్ ట్రోఫీ 63వ ఎడిష‌న్ ఆదివారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈస్ట్ జోన్‌తో నార్త్ఈస్ట్ జోన్‌, నార్త్ జోన్‌తో వెస్ట్ జోన్ త‌ల‌ప‌డుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అంద‌రి క‌ళ్లు ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ వైభ‌వ్ సూర్య‌వంశీపై నెల‌కొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభ‌మైన కాసేప‌టికే వైభ‌వ్ మూడు ఫోర్లు కొట్టిన‌ప్ప‌టికీ చెత్త షాట్ ఆడి పెవిలియ‌న్ చేరాడు. 

నార్త్ఈస్ట్ జోన్ పేస‌ర్ బిష్వోర్జిత్ కొంతోజ‌మ్ బౌలింగ్‌లో వైభ‌వ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియ‌న్ చేరుతున్న క్ర‌మంలో వైభ‌వ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్య‌కు టేప్ అంటించి ఉండ‌డం అభిమానులు గ‌మ‌నించారు. ఆ త‌ర్వాత ఫీల్డింగ్ స‌మ‌యంలోనూ వైభ‌వ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండ‌డం క‌నిపించింది. దీంతో అస‌లు వైభ‌వ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడ‌నే దానిపై ఆరా తీశారు. దీంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

మ్యాచ్‌లో వైభవ్ 13వ నంబ‌ర్ ఉన్న జెర్సీని ధ‌రించాడు. నిజానికి వైభ‌వ్ సూర్య‌వంశీ జెర్సీ నెంబ‌ర్ 3. ఐపీఎల్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఇదే జెర్సీ నెంబ‌ర్‌తో బ‌రిలోకి దిగాడు. ఆ త‌ర్వాత టీమిండియా త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స‌మ‌యంలోనూ వైభ‌వ్ మూడు నెంబ‌ర్ జెర్సీతోనే ఆడాడు. 

అయితే దులీప్ ట్రోఫీలో వైభ‌వ్‌కు మూడో నెంబ‌ర్ జెర్సీ స్థానంలో 13వ నెంబ‌ర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జ‌ట్టు వైభ‌వ్ కోసం త‌నకు అచ్చొచ్చిన మూడో నెంబ‌ర్ జెర్సీని అందించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని లాజిస్టిక్స్ మేనేజ‌ర్ తెలిపాడు. త‌న‌కు మూడు నెంబ‌ర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుంద‌ని భావించాడేమో.. అందుకే వైభ‌వ్ త‌నకు ఇచ్చిన 13వ నెంబ‌ర్ జెర్సీలో ఒక‌టి సంఖ్య క‌నిపించకుండా టేప్ అంటించాడు. ఒక‌టి సంఖ్య లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబ‌ర్‌గా మారిపోయింది. 

ఇక మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన వైభ‌వ్ 6 బంతుల్లో 8 ప‌రుగులు చేసి నిష్క్ర‌మించాడు. దీంతో అభిమానులు వైభ‌వ్ జెర్సీపై ఫ‌న్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభ‌వ్‌కు ల‌క్ క‌లిసిరాలేదని కొంద‌రు పేర్కొంటే... ఒక‌వేళ త‌నకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబ‌ర్‌ను ఇచ్చి ఉంటే మ్యాచ్‌లో ఇర‌గ‌దీసేవాడేమో" అని మ‌రికొంద‌రు తెలిపారు. 

అయితే వైభ‌వ్ త‌న జెర్సీని తెప్పించాల‌ని ఇప్ప‌టికే ఈస్ట్‌జోన్ జ‌ట్టుకు స‌మాచారం ఇచ్చాడ‌ట‌. రెండో ఇన్నింగ్స్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న ల‌క్కీ నెంబ‌ర్ జెర్సీతోనే బ‌రిలోకి దిగే అవ‌కాశం లేక‌పోలేదు.

Read: బ్యాడ్మింటన్‌ దిగ్గజం సైనా నెహ్వాల్‌ కీలక ప్రకటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement