Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌ | Big Blow For Pakistan Ahead Of Womens Asia Cup, Injured Najiha Alvi Replaced By Sadaf Shamas, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Aug 25 2026 9:52 AM | Updated on Aug 25 2026 11:49 AM

Shamas replaces injured Alvi in Pakistans Asia Cup squad

మహిళల ఆసియాకప్‌-2026 టోర్నీకి సమయం అసన్నమైంది. ఆగ‌స్టు 28 నుంచి ఈ ఖండాంతర టోర్నీ ప్రారంభం కానుంది. అయితే మెగా ఈవెంట్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది. యువ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నజీహా అల్వి మోకాలి గాయం కార‌ణంగా ఆసియాక క‌ప్‌కు దూర‌మ‌మైంది. ఆమె స్ధానాన్ని మ‌రో యువ ప్లేయ‌ర్‌ సదాఫ్ షమాస్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భ‌ర్తీ చేసింది.

ప్రాక్టీస్ సెష‌న్‌లో భాగంగా నజీహా ఎడమ మోకాలికి గాయ‌మైంది. స్కాన్ రిపోర్ట్‌లో గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. దీంతో పీసీబీ వైద్య బృందం సూచన మేరకు ఆసియాకప్ జట్టు నుంచి తప్పించాం. ఆమె స్ధానంలో సదాఫ్ షమాస్‌ను తీసుకున్నాం. నజీహా తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి నాలుగు వారాలకు పైగా సమయం పట్టే అవకాశముంది అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

పాక్ త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 1న థాయ్‌లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 5న దుబాయ్ వేదిక‌గా భార‌త్‌-పాక్ మ‌ధ్య హైవోల్ట్‌జ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ 8 జట్ల‌ను 
రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌–ఎలో ఇండియా, పాకిస్తాన్‌, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ ఉండగా.. గ్రూప్‌–బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, యూఏఈ ఉన్నాయి.

మహిళల ఆసియా కప్‌కు పాకిస్థాన్ జట్టు
ఫాతిమా సనా (కెప్టెన్), అయేషా జాఫర్, ఎమాన్ నసీర్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (వికెట్ కీప‌ర్‌), నష్రా సంధు, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, షావాల్ జుల్ఫికర్, తుబా హసన్, ఉమ్-ఎ-హనీ, వహీదాఫ్ అఖ్తర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement