అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పాక్ సీనియ‌ర్ గుడ్‌బై | PCB Confirms-PAK-Pacer Kainat Imtiaz Announces International Retirement | Sakshi
Sakshi News home page

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పాక్ సీనియ‌ర్ గుడ్‌బై.. అమ్మ‌ బాట‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌!

Oct 4 2026 4:38 PM | Updated on Oct 4 2026 5:05 PM

PCB Confirms-PAK-Pacer Kainat Imtiaz Announces International Retirement

Photo Credit: Twitter

పాకిస్తాన్ మ‌హిళా క్రికెట‌ర్‌, జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ కైనాత్ ఇంతియాజ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్ర‌క‌టించింది. 34 ఏళ్ల కైనాత్ ఇంతియాజ్ పాకిస్తాన్ త‌ర‌ఫున 2010 నుంచి 2023 మ‌ధ్య కాలంలో 19 వ‌న్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడింది.  

2010 ఆసియా గేమ్స్‌, 2014 ఆసియా గేమ్స్‌లో స్వ‌ర్ణం గెలిచిన పాక్ జ‌ట్టులో కైనాత్ స‌భ్యురాలిగా ఉంది. 2017 ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ  పాక్ త‌ర‌ఫున కైనాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఓవ‌రాల్‌గా రెండు ఫార్మాట్లు క‌లిపి 40 మ్యాచ్‌లాడిన కైనాత్ 18 వికెట్లు ప‌డ‌గొట్టింది. కైనాత్ పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయింద‌ని పీసీబీ తెలిపింది.

ఇక రిటైర్మెంట్ అనంత‌రం కైనాత్ ఇంతియాజ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రిఫ‌రీగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ మ‌ధ్య జ‌రిగిన జాతీయ వుమెన్ అండ‌ర్‌-19 టీ20 టోర్న‌మెంట్‌లో కైనాత్ మ్యాచ్ రిఫ‌రీగా ప‌నిచేసింది.  

ఇక కైనాత్ ఇంతియాజ్ త‌ల్లి స‌లీమా ఇంతియాజ్ కూడా ప్ర‌స్తుతం ఐసీసీ అంత‌ర్జాతీయ డెవ‌ల‌ప్‌మెంట్ ప్యానెల్‌లో అంపైర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. స‌లీమా 9 వ‌న్డేలు, 69 టీ20 మ్యాచ్‌ల్లో స‌లీమా అంపైర్ బాధ్య‌త‌లు నిర్వ‌హించింది.

ఇదీ చదవండి: వైభవంగా ముగింపు వేడుకలు.. పతాకధారిగా నీరూ ధండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement