భారత్‌–న్యూజిలాండ్‌ టెస్టు సమరం.. టాస్‌ గెలిచిన గిల్‌ సేన! | India New Zealand Test Match-2026 | Sakshi
Sakshi News home page

భారత్‌–న్యూజిలాండ్‌ టెస్టు సమరం.. టాస్‌ గెలిచిన గిల్‌ సేన!

Nov 19 2026 3:20 AM | Updated on Nov 19 2026 3:33 AM

India New Zealand Test Match-2026

ఇటీవల వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు అసలైన పరీక్షకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌ గడ్డపై మరోసారి టెస్టు సత్తా చాటేందుకు శుభ్‌మన్‌ గిల్‌ సేన బరిలోకి దిగనుంది. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈరోజు (గురువారం) వెల్లింగ్టన్‌లోని బేసిన్‌ రిజర్వ్‌ మైదానం వేదికగా జరగనుంది.

టాస్‌ గెలిచిన భారత్‌..
భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 3 గంటలకు టాస్‌ జరగగా.. టీమిండియా టాస్‌ గెలిచింది. దీంతో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. మరికొద్ది నిమిషాల్లో (ఉదయం 3:30 గంటలకు) ఆట ప్రారంభం కానుంది.

బరిలోకి దిగుతున్న ఇరు జట్లు..
భారత్‌ జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

న్యూజిలాండ్‌ జట్టు: టామ్‌ లాథమ్‌(కెప్టెన్‌), డెవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, నాథన్‌ స్మిత్‌, కైల్‌ జేమీసన్‌, మాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement