బంగ్లాతో తొలి టెస్టు.. విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా | South Africa Close In on Victory as Bangladesh Falter in 2nd Innings of 1st Test | Sakshi
Sakshi News home page

SA vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా

Nov 18 2026 9:24 PM | Updated on Nov 18 2026 9:24 PM

South Africa Close In on Victory as Bangladesh Falter in 2nd Innings of 1st Test

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 57 పరుగుల వెనుకంజలో ఉంది.   అంతకుముందు సౌతాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో 557 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.

ప్రొటీస్ బ్యాటర్లలో మార్క్వెస్ అకెర్మాన్ (157), రియాన్ రికెల్టన్ (102) శతకాలతో కదం తొక్కగా, జుబైర్ హంజా (83) తృటిలో సెంచరీ కోల్పోయి గొప్పగా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్ 4 వికెట్లు పడగొట్టగా, మెహదీ హసన్, టాస్కిన్ అహ్మద్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.  

ఆ తర్వాత 157 ప‌రుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ త‌డ‌బ‌డుతోంది.  అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తౌహిద్ హృదయ్ (137), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (120) అద్భుత శతకాలతో మెరిశారు.

వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆల్ అవుటైంది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో స్టార్ పేసర్ కగిసో రబాడా 5 వికెట్లు తీసి చెలరేగగా, డేన్ ప్యాటర్సన్ 4 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement