బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్ కీపర్‌గా లిట్టన్ దాస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దాస్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ మొత్తం 8 డిస్మిసల్స్ చేయగా.. అందులో 6 క్యాచ్‌లు ఉండగా, 2 అద్భుతమైన స్టంపింగ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రికార్డు వసీమ్ బరి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్, రిడ్లీ జాకబ్స్, జోషువా డా సిల్వా పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 7 డిస్మిసల్స్ చేశారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజాల రికార్డును లిట్టన్ బ్రేక్ చేశాడు.
బ్యాట్‌తోనూ అదరగొట్టి..
కాగా ఈ మ్యాచ్‌లో లిట్టన్ దాస్ కేవలం గ్లవ్స్‌తోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దాస్.. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడు 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో అజేయంగా 120 పరుగులు సాధించాడు.
అతడితో పాటు తౌహిద్ హ్రిదోయ్ కూడా సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్కెస్ అకెర్‌మాన్, డేన్ ప్యాటర్సన్ వికెట్లు మినహా.. మిగతా అన్ని వికెట్ల పతనంలోనూ దాస్ భాగమయ్యాడు.
చదవండి: వైభవ్ టీమ్ సంచలనం.. చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ


