చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. దెబ్బకు ధోని, రాహుల్‌ రికార్డులు బ్రేక్‌ | Litton Das Eclipses MS Dhoni, KL Rahul And Pant With Stunning Century In BAN vs SA 1st Test | Sakshi
Sakshi News home page

BAN vs SA: చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. దెబ్బకు ధోని, రాహుల్‌ రికార్డులు బ్రేక్‌

Nov 16 2026 3:49 PM | Updated on Nov 16 2026 4:05 PM

Litton Das Eclipses MS Dhoni, KL Rahul And Pant With Stunning Century In BAN vs SA 1st Test

జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లిట్ట‌న్‌.. తౌహీద్ హృదయ్ తో కలిసి జ‌ట్టును ఆదుకున్నాడు. 

వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో లిట్ట‌న్ దాస్ త‌న 8వ టెస్టు సెంచ‌రీ మార్క్‌ను న‌మోదు చేశాడు. ఓవ‌రాల్‌గా 179 బంతులు ఎదుర్కొన్న లిట్టన్‌.. 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్బుత నాక్‌తో అతడు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా లిట్టన్ దాస్ (120) సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ (101) పేరిట ఉండేది.

సఫారీ గడ్డపై ఆసియా కీపర్ల అత్యధిక స్కోర్లు ఇవే
లిట్టన్ దాస్‌-120
కేఎల్ రాహుల్‌-101
ఎంఎస్ ధోని-90
కుమార సంగక్కర-89

అదదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన కీపర్ల జాబితాలో లిట్టన్ దాస్‌(5) రెండో స్థానానికి చేరుకున్నాడు.  దక్షిణాఫ్రికా కీపర్ కైల్ వెర్రెయిన్ (4)ను లిట్టన్ అధిగమించాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్‌(6) అగ్రస్దానంలో ఉన్నాడు.

డబ్ల్యూటీసీలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు (6) చేసిన బ్యాటర్‌గా లిట్టన్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ముష్ఫికర్ రహీమ్ (5), నజ్ముల్ హొస్సేన్ శాంటో (5)లను అతను వెనక్కి నెట్టాడు. మోమినుల్ హక్ (3), తౌహీద్ హృదయ్ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
చదవండి: Asia Cup: 'పాక్‌పై ప్రతాపం కాదు.. దమ్ముంటే వారిపై చూపించండి'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement