అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చివరి బంతికి విజయం అనంతరం భారత యువ ఆటగాళ్లు చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత ఆటగాళ్లు మైదానంలో అతిగా ప్రవర్తించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత జట్టు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
"భారత క్రికెట్ జట్టు మైదానంలో తమ దూకుడు చూపించాలనుకుంటే, ఇకపై తమ స్థాయికి తగ్గ జట్లను ఎంచుకోవాలి. పాకిస్తాన్ ఇప్పుడు చాలా బలహీనమైన జట్టు అయిపోయింది. వారిని ఓడించడం చాలా సులభం. భారత్ దూకుడు చూపించడానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంండ్ జట్లను ఎంచుకోవాలని " అని మంజ్రేకర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
ఏమి జరిగిందంటే?
ఒమన్‌లోని అల్ అమెరాత్ వేదికగా భారత్-పాక్ మధ్య ఫైనల్ పోరు ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఒకొనక దశలో 252 పరుగులకే 8 వికెట్లు ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో మనాల్ చౌహన్‌తో పాటు పదో నంబర్ నంబర్ బ్యాటర్ మోహిత్ ఉల్వా (26 బంతుల్లో 49 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
చివరి బంతికి 3 పరుగులు అవసరమైన వేళ మోహిత్ ఫోర్ బాది జట్టును గెలిపించాడు. దీంతో విజయానంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చి, పాక్ ఆటగాళ్ల ముఖం ముందుకు వెళ్లి గట్టి ఆరుస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల వైపు సైగలు చేయడం విమర్శలకు దారితీసింది. కానీ బీసీసీఐ మాత్రం యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచింది.
ఓటమి అంచున ఉన్న స్థితి నుంచి పుంజుకుని గెలవడం జట్టు పోరాట పటిమకు నిదర్శనం. అలాంటి అద్భుత విజయం సాధిస్తే ఏ జట్టు ఆటగాళ్లైనా ఈ విధంగానే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయం గురుంచి మనం ఎక్కువ ఆలోచించకూడదు అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
మరోవైపు ఈ విమర్శలపై భారత అండర్-19 కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని స్పందిస్తూ.. పాకిస్తాన్‌తో జరిగే నరాలు తెగే ఉత్కంఠ పోరులో భావోద్వేగాలు సహజమని, ఆటగాళ్ల సంబరాల్లో తప్పులేదని సమర్థించుకున్నాడు. నాటి ఘటనపై తానేమీ పశ్చాత్తాపపడటం లేదని స్పష్టం చేశాడు.


