భారత అండర్‌ 19 జట్టు దూకుడును మెచ్చుకున్న అక్తర్ | Shoaib Akhtar Sends Clear Message To India U19 Team For Aggressive Celebration vs Pakistan | Sakshi
Sakshi News home page

భారత అండర్‌ 19 జట్టు దూకుడును మెచ్చుకున్న అక్తర్

Nov 16 2026 11:52 AM | Updated on Nov 16 2026 11:56 AM

Shoaib Akhtar Sends Clear Message To India U19 Team For Aggressive Celebration vs Pakistan

తాజాగా ముగిసిన అండర్‌ 19 ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాక్‌ జట్ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌‌పై విజయం సాధించిన తర్వాత భారత యువ ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. భారత ఆటగాళ్ల దూకుడును ఇష్టపడ్డానని చెబుతూనే.. మైదానంలో పరస్పర గౌరవం కాపాడుకోవాలని సూచించాడు.

విలువలు, పరస్పర గౌరవం ముఖ్యం: అక్తర్
భారత్, పాక్‌ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఉద్రిక్తతపై మాట్లాడిన అక్తర్.. తాను భారత మాజీ క్రికెటర్లతో ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని గుర్తుచేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్లతో తనకు మంచి స్నేహం ఉందని చెప్పాడు.

క్రికెట్ ఆడటమే కాకుండా ఆటలో విలువలను కూడా పాటించాలని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్ల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, పరస్పర గౌరవం తగ్గకూడదని సూచించాడు.

భారత జట్టు దూకుడును మెచ్చుకున్న అక్తర్
భారత అండర్‌ 19 ఆటగాళ్లకు అక్తర్ ప్రత్యేక సందేశం ఇచ్చాడు. మైదానంలో దూకుడుగా ఉండాలని, అయితే ఆ దూకుడు ఆట విలువలకు విరుద్ధంగా ఉండకూడదని అభిప్రాయపడ్డాడు.

ఈ టోర్నీలో పాక్‌ జట్టే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఫైనల్లో ఒత్తిడి తట్టుకోలేక ఓటమి పాలైందని విశ్లేషించాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత జట్టుకు బాగా తెలుసని ప్రశంసించాడు. ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన భారత జట్టుకు అభినందనలు తెలిపాడు. మ్యాచ్‌ను ముగించగల సత్తా, నమ్మకం ఉన్న ఆటగాళ్లు భారత్‌కు ఉన్నారని అన్నాడు.

కాగా, అండర్‌ 19 ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌-పాక్‌ ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణకు బీజం పడింది అదే టోర్నీలో జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో. దీపావలి రోజు జరిగిన ఆ మ్యాచ్‌లో పాక్‌ భారత్‌పై విజయం సాధించింది. ఆ గెలుపు తర్వాత పాక్‌ ఆటగాళ్లు టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇందుకు ప్రతీకారంగా భారత ఆటగాళ్లు ఫైనల్లో పాక్‌ను భారీ దెబ్బేశారు. 

ఇదీ చదవండి: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement