సౌతాఫ్రికాపై బంగ్లా బ్యాట‌ర్ల ప్ర‌తాపం.. ఏకంగా 400 ప‌రుగులు | Bangladesh Post Record 400 in Johannesburg Behind Hridoy, Litton Tons | Sakshi
Sakshi News home page

BAN vs SA: సౌతాఫ్రికాపై బంగ్లా బ్యాట‌ర్ల ప్ర‌తాపం.. ఏకంగా 400 ప‌రుగులు

Nov 16 2026 3:11 PM | Updated on Nov 16 2026 3:26 PM

Bangladesh Post Record 400 in Johannesburg Behind Hridoy, Litton Tons

జోహన్నస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు సత్తాచాటారు. బంగ్లా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి ఆలౌటైంది.  అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు సౌతాఫ్రికా పేస్ దిగ్గజం కగిసో రబాడ ఆరంభంలోనే షాకిచ్చాడు.

రబాడ తన అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడి దెబ్బకు పర్యాటక జట్టు కేవలం  22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హ్రిదోయ్(137), లిట్టన్ దాస్‌(120) భారీ సెంచరీలతో కదం తొక్కారు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సౌతాఫ్రికాపై ఏ వికెట్‌కైనా బంగ్లాదేశ్ జోడీ సాధించిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. ప్రోటీస్‌ బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా..డేన్ ప్యాటర్సన్ నాలుగు వికెట్లు సాధించాడు. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాపై బంగ్లాదేశ్‌కు ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం. ఇంత‌కుముందు 322 ప‌రుగుల‌గా ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆ స్కోర్‌ను బంగ్లా దాటేసింది.
చదవండి: IPL 2027: 'అతడొక ఫేక్ బౌలర్‌.. సన్‌రైజర్స్‌ది చెత్త నిర్ణయం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement