సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌.. బంగ్లాదేశ్‌ అద్భుత పోరాటం | Hridoy, Litton lead Bangladesh fightback against South Africa with record 206 run stand | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌.. బంగ్లాదేశ్‌ అద్భుత పోరాటం

Nov 16 2026 7:48 AM | Updated on Nov 16 2026 7:48 AM

Hridoy, Litton lead Bangladesh fightback against South Africa with record 206 run stand

source: X

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అద్భుతంగా పుంజుకుంది. ఒక దశలో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును తౌహిద్ హృదోయ్ (137), లిటన్ దాస్ (92 నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సౌతాఫ్రికాపై ఏ వికెట్‌కైనా బంగ్లాదేశ్ జోడీ సాధించిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. 

హృదోయ్‌-దాస్‌ వీరోచిత పోరాటంతో పాటు తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (67) రాణించడంతో బంగ్లాదేశ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. కగిసో రబడా ఐదు వికెట్లతో విజృంభించినప్పటికీ బంగ్లాదేశ్ బ్యాటర్లు పోరాటపటిమ ప్రదర్శించారు.

ముందు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ
దీనికి ముందు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన డబుల్‌ సెంచరీ (242) చేసిన హృదోయ్.. ఇప్పుడు మరో భారీ ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం నాలుగో టెస్టు ఆడుతున్న అతడు సౌతాఫ్రికాపై టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో బంగ్లాదేశ్ బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో (2022) మహ్మదుల్ హసన్ జాయ్ ఈ ఘనత సాధించాడు.

మూడో స్థానానికి రబాడ
సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా అద్భుత ప్రదర్శన చేశాడు. 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇది అతడికి 18వ ఐదు వికెట్ల ప్రదర్శన. తద్వారా సౌతాఫ్రికా తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్ల జాబితాలో మఖాయా ఎన్తినితో కలిసి మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో డేల్ స్టెయిన్ (26), అలన్ డొనాల్డ్ (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

కాగా, బంగ్లాదేశ్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement