బాలి: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2035 వరకు పురుషుల క్రికెట్ ఈవెంట్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఆదివారం జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2031లో బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు వన్డే వరల్డ్ కప్‌ను సంయుక్తంగా నిర్వహించనుంది. 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. చివరగా 2006లో భారత్ చాంపియన్స్ ట్రోఫీకి వేదికగా నిలిచింది. 2028 టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆ్రస్టేలియా–న్యూజిలాండ్... 2030 టి20 వరల్డ్‌కప్ టోర్నీకి ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆతిథ్యమిస్తాయి.


