రేపటి నుంచే ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ | Asia Cup Rising Stars 2026: Full Schedule, Live Streaming, Teams, Live Telecast And More | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ

Nov 18 2026 1:22 PM | Updated on Nov 18 2026 1:29 PM

Asia Cup Rising Stars 2026: Full Schedule, Live Streaming, Teams, Live Telecast And More

source: X

డీపీ వరల్డ్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ ఖతార్‌లోని దోహా వేదికగా రేపటి నుంచి ప్రారంభం​ కానుంది. ఈ టోర్నీలో భారత్‌ సహా శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఏ జట్లు.. అలాగే హాంగ​్‌కాంగ్‌ చైనా, నేపాల్‌, యూఏఈ జట్లు పాల్గొంటున్నాయి.

ఈ టోర్నీలో భారత ఏ జట్టు తిలక్‌ వర్మ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. జట్టులో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, రింకూ సింగ్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు ఉండటం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. గతేడాది సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌-ఏ చేతిలో ఓడిన భారత్‌ ఈసారి టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గ్రూప్‌ దశలో భారత​్‌-పాక్‌ మ్యాచ్‌ నవంబర్‌ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

ఎక్కడ చూడాలి..?
భారత్‌లో ఈ టోర్నీ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో సోనీలివ్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంటుంది.

షెడ్యూల్‌
అన్ని మ్యాచ్‌ల సమయాలు భారత కాలమానం ప్రకారం (IST).

నవంబర్‌ 19, గురువారం
- బంగ్లాదేశ్‌-ఏ vs హాంకాంగ్‌: ఉదయం 11:30 గంటలకు
- శ్రీలంక-ఏ vs ఆఫ్ఘనిస్తాన్‌-ఏ: మధ్యాహ్నం 3:30 గంటలకు

నవంబర్‌ 20, శుక్రవారం
- పాకిస్తాన్‌-ఏ vs యూఏఈ: ఉదయం 11:30 గంటలకు
- భారత్‌-ఏ vs నేపాల్‌: మధ్యాహ్నం 3:30 గంటలకు

నవంబర్‌ 21, శనివారం
- శ్రీలంక-ఏ vs హాంకాంగ్‌: ఉదయం 11:30 గంటలకు
- బంగ్లాదేశ్‌-ఏ vs ఆఫ్ఘనిస్తాన్‌-ఏ: మధ్యాహ్నం 3:30 గంటలకు

నవంబర్‌ 22, ఆదివారం
- యూఏఈ vs నేపాల్‌: ఉదయం 11:30 గంటలకు
- భారత్‌-ఏ vs పాకిస్తాన్‌-ఏ: మధ్యాహ్నం 3:30 గంటలకు

నవంబర్‌ 23, సోమవారం
- ఆఫ్ఘనిస్తాన్‌-ఏ vs హాంకాంగ్‌: ఉదయం 11:30 గంటలకు
- శ్రీలంక-ఏ vs బంగ్లాదేశ్‌-ఏ: మధ్యాహ్నం 3:30 గంటలకు

నవంబర్‌ 24, మంగళవారం
- భారత్‌-ఏ vs యూఏఈ: ఉదయం 11:30 గంటలకు
- పాకిస్తాన్‌-ఏ vs నేపాల్‌: మధ్యాహ్నం 3:30 గంటలకు

సెమీఫైనల్స్‌, ఫైనల్‌ తేదీలు
తొలి సెమీఫైనల్‌- నవంబర్‌ 26 మధ్యాహ్నం 3:30
రెండో సెమీఫైనల్‌- నవంబర్‌ 27 మధ్యాహ్నం 3:30
ఫైనల్‌- నవంబర్‌ 29- మధ్యాహ్నం 3:30

ఇదీ చదవండి: ఐపీఎల్‌ 2027కు సంబంధించి కీలక అప్‌డేట్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement