source: X
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగుతున్న సిరీస్ డిసైడర్ వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ బెన్ డకెట్ కేవలం 94 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు పునాది వేశాడు. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న డకెట్ 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఓ పక్క వికెట్లు పడుతున్నా డకెట్ ఒంటరిపోరాటం చేసి జట్టు స్కోర్‌ను 250 మార్కు తాకించాడు. 251 పరుగుల వద్ద అతడు ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 264-6గా ఉంది.విల్ జాక్స్ (27), సామ్ కర్రన్ 94) క్రీజ్‌లో ఉన్నారు. మిగతా బ్యాటర్లలో టామ్ బాంటన్ 44, జో రూట్ 12, హ్యారీ బ్రూక్ 17, జోర్డన్ కాక్స్ 12, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాట్ రెన్షా 3 వికెట్లు తీయగా.. జాక్ ఎడ్వర్డ్స్, కూపర్ కన్నోల్లీ, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టాడు.
కాగా, ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఆసీస్ తొలి మ్యాచ్, ఇంగ్లండ్ రెండో వన్డేలో నెగ్గాయి.
ఇదీ చదవండి: ధోని రిటైర్మెంట్.. ఆ ముగ్గురే ఆల్ సీజన్ ప్లేయర్స్


