శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన క్రికెట్ త్రిపురాన విజయ్‌ను ఢిల్లీ క్యాపిట ల్స్ రిటైన్ చేసుకుంది. విజయ్‌ను రూ.30 లక్షలకు రీటైన్ చేసుకుంటున్న ప్రకటించింది. దీంతో విజయ్‌తోపాటు వారి కుటుంబీకులు, జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన అనధికారిక రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత–ఏ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్ దులిప్‌త్రోఫీలో సోత్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించడంతోపాటు భారత స్టార్ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఇషాన్‌కిషాన్ వంటి టాప్‌క్లాస్ బ్యాటర్లను ఔట్ చేశాడు.
ఆల్‌రౌండర్‌గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ బ్యాటర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్‌గా అనేక మ్యాచ్‌ల్లో రివార్డులు అందుకున్నాడు. దీంతో డీసీ విజయ్‌ను తన వద్దే అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో పాల్గొన్న విజయ్‌కు రెండో సీజన్‌లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురుషుల క్రికెట్ టోర్నీ లో ఇండియా–బీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు. విజయ్ కుటుంబం టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటోంది.
సంతోషంగా ఉంది..
ఐపీఎల్‌లో వరుసగా మూడో ఏడాది ఆడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. కేఎల్ రాహుల్, అక్షర్‌భాయ్, పంత్ వంటి క్రికెటర్లతో ఆడే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. డీసీ తరఫున ఈ సీజన్‌లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నాకు అన్ని విధాలగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్‌లు, నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.
– త్రిపురాన విజయ్, క్రికెటర్


