Photo Credit: Twitter
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో జింబాబ్వే 57 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే పైచేయి సాధించింది. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ నసీర్ ఖాన్ మరుఫ్ఖిల్ (242 బంతుల్లో 101 నాటౌట్) వీరోచిత సెంచరీ సాధించినప్పటికీ, ఆఫ్గన్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
418 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 360 పరుగులకు ఆలౌటైంది. మిగిలిన బ్యాటర్లలో అఫ్సర్ జజయ్ (87), అర్థసెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లలో హష్మతుల్లా షాహిది (35), రహ్మత్ షా (30), వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ (26), ఆఖర్లో మొహమ్మద్ సలీమ్ (22)తో కలిసి నసీర్ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, విన్సెంట్ మసికేస, గ్రేమీ క్రీమర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఆఫ్గన్ ఆల్‌రౌండర్ నసీర్ ఖాన్‌కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అయితే మ్యాచ్‌లో ఒక దశలో జింబాబ్వే ఏడు క్యాచ్‌లు మిస్ చేసి చేజేతులా గెలుపును దూరం చేసుకుంటుందా అనిపించింది.
కానీ చివరికి 57 పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. అంతకముందు జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటయ్యింది. బదులుగా అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే పరిమితం కావడంతో జింబాబ్వేకు వంద రన్స్‌కు పైగా ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసి ఆఫ్గన్ ముందు 418 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇక జింబాబ్వే కెప్టెన్‌గా బ్రియాన్ బెన్నెట్‌కు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.
𝐇𝐔𝐍𝐃𝐑𝐄𝐃 𝐎𝐍 𝐓𝐄𝐒𝐓 𝐃𝐄𝐁𝐔𝐓 𝐅𝐎𝐑 𝐍𝐀𝐒𝐄𝐄𝐑 𝐊𝐇𝐀𝐍! 💯 Naseer Khan Maroof Khail has carved his name into Afghanistan’s cricket history, becoming only the third Afghan player to score a century on his Test debut! 👏👏 The talented young all-rounder produced a magnificent display of grit and determination to reach a fighting hundred in the fourth innings of the second Test against Zimbabwe. 🙌 #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam
— Afghanistan Cricket Board (@ACBofficials) November 17, 2026
AfghanAtalan showed tremendous fight and determination throughout Day 5, but Zimbabwe ultimately claimed the second Test by 57 runs. A special mention goes to debutant Naseer Khan, whose unbeaten 101 off 242 balls, and Afsar Khan Zazai, who scored 87 off 202 balls, took the match down to its final moments. A heartbreaking result after such a courageous effort. #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam
— Afghanistan Cricket Board (@ACBofficials) November 17, 2026
ఇదీ చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. భారత తుదిజట్టు ఇదే!


