PAK vs SL: పాకిస్తాన్‌, శ్రీలంక జట్లకు భారీ షాక్‌ | PAK vs SL 1st Test: Pakistan And Sri Lanka Punished Heavily By ICC | Sakshi
Sakshi News home page

PAK vs SL: పాకిస్తాన్‌, శ్రీలంక జట్లకు భారీ షాక్‌

Nov 17 2026 5:42 PM | Updated on Nov 17 2026 5:53 PM

PAK vs SL 1st Test: Pakistan And Sri Lanka Punished Heavily By ICC

PC: ICC X

టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న పాకిస్తాన్‌- శ్రీలంక జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. ఇరుజట్ల మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. పాక్‌తో పోలిస్తే లంక జట్టుకు రెట్టింపు జరిమానా వేసింది. 

తొలి టెస్టు ‘డ్రా’
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లింది. రావల్పిండి వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ (106.3 ఓవర్లలో)ను తొమ్మిది వికెట్ల నష్టానికి 434 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.అనంతరం శ్రీలంక 117.2 ఓవర్లలో 446 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన పాక్‌ జట్టు.. 84.5 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 284 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా ఫలితం తేలకుండానే మ్యాచ్‌ ముగిసిపోయింది.

పాక్‌ జట్టు ఫీజులో 25 శాతం కోత
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో పాక్‌, లంక జట్లు నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేదు. పాకిస్తాన్‌ నిర్ణీత సమయంలో ఐదు ఓవర్లు తక్కువగా వేసింది. ఫలితంగా ఐసీసీ పాక్‌ జట్టు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత వేసింది. 

శ్రీలంక జట్టు ఫీజులో 50 శాతం కట్‌
మరోవైపు.. శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్ల కంటే.. ఏకంగా 15 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ లంక జట్టు మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 50 శాతం కోత విధించింది. ఇలా ఇరుజట్లు స్లో ఓవర్‌ రేటుతో జరిమానా రూపంలో భారీ మూల్యమే చెల్లించాయి.

డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ కోత
అదే విధంగా.. స్లో ఓవర్‌ రేటు కారణంగా పాక్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల ఖాతా నుంచి ఒక పాయింట్‌ (5 ఓవర్ల ఆలస్యం).. శ్రీలంక డబ్ల్యూటీసీ పాయింట్ల ఖాతా నుంచి ఐదు పాయింట్లు (15 ఓవర్ల ఆలస్యం) ఐసీసీ కట్‌ చేసింది. 

దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడు నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. పాకిస్తాన్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా పాక్‌ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. శ్రీలంక సైతం అదే బాటలో పయనిస్తోంది. 

ఇదీ చదవండి: నిప్పులు చెరిగిన పాక్ బౌల‌ర్లు.. లంక ఖాతాలో చెత్త రికార్డు
కెప్టెన్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement