సెంచ‌రీతో చెల‌రేగిన సౌతాఫ్రికా ఓపెన‌ర్‌ | South Africa Opener-Marques Ackerman-Maiden Test Century VS BAN | Sakshi
Sakshi News home page

సెంచ‌రీతో చెల‌రేగిన సౌతాఫ్రికా ఓపెన‌ర్‌

Nov 16 2026 8:24 PM | Updated on Nov 16 2026 8:27 PM

South Africa Opener-Marques Ackerman-Maiden Test Century VS BAN

Photo Credit: Twitter

జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో మొద‌లైన తొలి టెస్టులో సౌతాఫ్రికా ప‌ట్టు బిగించింది. మార్క‌ర‌మ్ రూపంలో తొలి వికెట్ త్వ‌ర‌గా కోల్పోయిన‌ప్ప‌టికీ, మ‌రో ఓపెన‌ర్ మార్కూస్ అకెర్‌మ‌న్ బంగ్లా బౌల‌ర్ల‌ను  ఉతికారేస్తూ త‌న కెరీర్‌లో తొలి టెస్టు సెంచ‌రీని సాధించాడు. 125 బంతుల్లో శ‌త‌కం మార్క్ అందుకున్న అకెర్‌మ‌న్ ఖాతాలో 15 ఫోర్లు ఉన్నాయి. 

అయితే వెయ్యి రోజుల త‌ర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న జుబైర్ హంజా (129 బంతుల్లో 83 ప‌రుగులు) అర్థ‌సెంచ‌రీ సాధించాడు.  సెంచ‌రీ చేస్తాడ‌ని భావించిన‌ప్ప‌టికీ, మోమినుల్ హ‌క్ బౌలింగ్‌లో లిట‌న్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య రెండో వికెట్‌కు న‌మోదైన 202 ప‌రుగుల (254 బంతుల్లో) భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

ప్ర‌స్తుతం సౌతాఫ్రికా 193 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. అంత‌క‌ముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తౌహిద్ హృదోయ్ (227 బంతుల్లో 137 ప‌రుగులు), లిట‌న్‌దాస్ (179 బంతుల్లో 120) భారీ శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. అంత‌క‌ముందు ఓపెన‌ర్ తంజిద్ హ‌స‌న్ (67) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్ల‌లో క‌గిసో ర‌బాడ 5 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, డేన్ పీట‌ర్స‌న్ 4, మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.

ఇదీ చదవండి: జింబాబ్వేతో టెస్టు.. ఓట‌మి దిశ‌గా అఫ్గానిస్తాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement