Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా 22 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్లు బుమ్రా, సిరాజ్ మ్యాచ్‌లు ఆడలేదు. టెస్టు సిరీస్ కోసం బుమ్రా సిద్ధమవుతుండగా, మరోవైపు సిరాజ్ మాత్రం బే ఓవల్ వేదికగా జరిగిన చివరి వన్డేలో మాత్రమే ఆడాడు.
అయినప్పటికీ, భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాత్రం వన్డేల్లో భారత్ తరఫున టాప్-2 పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా, సిరాజ్‌లు వన్డే సిరీస్ ఆడకపోయినప్పటికీ, అజయ్ జడేజా మాత్రం యువ పేసర్ల బృందం మెరుగైన బౌలింగ్ కలిగి ఉందని ప్రకటించడానికి విముఖత వ్యక్తం చేశాడు. అయితే కుర్రాళ్ల ప్రదర్శనను విజయాలుగా కాకుండా వారి ఎదుగుదలకు సంకేతంగా చూడాలని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.
అజయ్ జడేజా మాట్లాడుతూ.. ''వాళ్లంతా ఎదుగుతున్న బౌలర్లు అని నేనంటాను. హిట్ అయ్యారా? లేదా ఫట్ అయ్యారా? అనేది చెప్పను. ఎందుకంటే జట్టులో బుమ్రా లేడు. సిరాజ్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. మరో కీలక బౌలర్ ప్రసిధ్ క్రిష్ణ గాయపడ్డాడు. ఇక బుమ్రా, సిరాజ్‌లు ఇప్పటికే టీమిండియాకు అగ్రశ్రేణి బౌలర్లుగా ఉన్నారు. వారు లేకుండా బౌలింగ్ దళం అసంపూర్ణంగా ఉంటుంది.
అందుకే నేను అలా చెప్పాను. సంఖ్యల పరంగా చూసుకుంటే మాత్రం మన కుర్రాళ్లు కివీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టారు. ప్రత్యర్థిని తమ బంతులతో కకావికలం చేసి వికెట్లు తీశారు. గణాంకాల పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, అనుభవం పరంగా చూస్తే మాత్రం బుమ్రా, సిరాజ్‌ల వెనుకే ఉంటారు. అందుకే నా దృష్టిలో బుమ్రా, సిరాజ్‌లు నెంబర్ 1,2 స్థానాల్లోనే ఉంటారు. '' అని చెప్పుకొచ్చాడు.
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, గుర్నూర్ బ్రార్ 3 మ్యాచ్‌లాడి 9 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడమే గాక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. బ్రార్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ 4 వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టాడు. అకిబ్ నబీ ఐదు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 4 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు సిరాజ్ ఆడిన ఒక వన్డేలో 10 ఓవర్లలో 50 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా, భారత పేసర్లు న్యూజిలాండ్‌లోని పేస్‌కు అనుకూలమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుని పర్యటనను విజయవంతంగా ముగించారు. నవంబర్ 19 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: ఆఫ్గన్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్


