సూర్య‌కుమార్ విధ్వంసం.. కేవ‌లం 29 బంతుల్లోనే | Suryakumar Yadav Blasts 29-Ball 82 In SMAT 2026 To Stay In Beast Mode | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: సూర్య‌కుమార్ విధ్వంసం.. కేవ‌లం 29 బంతుల్లోనే

Nov 16 2026 4:07 PM | Updated on Nov 16 2026 5:18 PM

Suryakumar Yadav Blasts 29-Ball 82 In SMAT 2026 To Stay In Beast Mode

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో టీమిండియా మాజీ కెప్టెన్‌, ముంబై సార‌థి సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేవలం 21 బంతుల్లోనే  60 పరుగులు చేసి వీరవిహారం చేసిన సూర్య.. సోమ‌వారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు.

198 పరుగుల భారీ లక్ష్య చేధనలో స్కై త‌న‌దైన శైలిలో విధ్వంసం సృష్టించాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో సూర్య బౌండరీల వర్షం కురిపించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్‌.. ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుపడ్డాడు.

ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో సర్ఫరాజ్ ఖాన్(17 బంతుల్లో 40) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని ముంబై 5 వికెట్లు కోల్పోయి కేవలం 15.4 ఓవర్లలోనే ఊదిపడేసింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్‌..19.2 ఓవర్లలో 197 పరుగులు చేసి ఆలౌటైంది. ముంబై బౌలర్లలో అథర్వ అంకోలేకర్, శార్థూల్ ఠాకూర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. గుజరాత్ బ్యాటర్లలో అశుతోష్ శర్మ(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సూర్య రీఎంట్రీ ఇస్తాడా!
కాగా భార‌త్‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 అందించిన త‌ర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్ జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. పేల‌వ ఫామ్ కార‌ణంగా అత‌డిని కెప్టెన్సీతో పాటు జ‌ట్టు నుంచి త‌ప్పించారు. అయితే దేశ‌వాళీ టోర్నీలో అద్భుతంగా రాణించి తిరిగి రీఎంట్రీ ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య మెరుపులు మెరిపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement