Photo Credit: Twitter
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు సిక్సర్లతో శివమెత్తారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య (32 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీతో మెరవగా, యశ్ ధుల్ (40 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీ సాధించాడు.
ఆఖర్లో నితీశ్ రానా (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), తేజస్వి దహియా (10 బంతుల్లో 20), హిమ్మత్ సింగ్ (4 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) ఇలా వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో సుక్‌దీప్ బజ్వా, సాహిల్ భాస్కర్ చెరో 2 వికెట్లు తీయగా, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 సిక్సర్లు నమోదవ్వగా, 18 బౌండరీలు వచ్చాయి. జమ్మూతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అదరగొట్టిన బ్యాటర్లు అదే ప్రదర్శనను పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ పునరావృతం చేశారు. ఇక జమ్మూతో మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ వరుసగా రెండో విజయంపై కన్నేసింది. అటు పంజాబ్ కూడా తమ తొలి మ్యాచ్‌లో హర్యానాపై 4 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఇదీ చదవండి:


