Photo Credit: Twitter
షార్జా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. 418 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో అఫ్సర్ జజయ్ (20 బ్యాటింగ్), ఇక్రమ్ అలిఖిల్ (20 బ్యాటింగ్) ఉన్నారు.
ఆటకు మరో రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో జింబాబ్వే విజయానికి మరో 5 వికెట్లు అవసరం కాగా, ఆఫ్గన్ గెలవాలంటే మరో 275 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, గ్రేమీ క్రీమర్, విన్సెంట్ మసికేస తలా ఒక వికెట్ పడగొట్టారు.
అంతకముందు ముజరబానీ (93 బంతుల్లో 58) అర్థసెంచరీకి తోడుగా గ్రేమీ క్రీమర్ (50 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో జింబాబ్వే తమ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 417 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆటకు మరో రోజు మిగిలి ఉండడంతో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది.
అంతకముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌట్ కాగా, అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇక జింబాబ్వే, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
That's stumps on Day 4! Ikram Alikhil (20*) and Afsar Zazai (20*) will resume the proceedings tomorrow morning with 143/5 on the board. They face a tough task, needing 275 more runs to win the game. #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam https://t.co/CGZ0IajPb4
— Afghanistan Cricket Board (@ACBofficials) November 16, 2026
ఇదీ చదవండి: ఆఫ్గన్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్


