కెప్టెన్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌.. ప్రకటన విడుదల | ILT20 2026: Heinrich Klaasen Appointed Gulf Giants Captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌.. ప్రకటన విడుదల

Nov 17 2026 4:09 PM | Updated on Nov 17 2026 4:26 PM

 ILT20 2026: Heinrich Klaasen Appointed Gulf Giants Captain

సన్‌రైజర్స్‌ జెర్సీలో క్లాసెన్‌ (PC: SRH/IPL X)

సౌతాఫ్రికా పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. ఈ ఏడాది అతడు ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20)లో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో వేలానికి ముందుగానే గల్ఫ్‌ జెయింట్స్‌ క్లాసెన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటన
ILT20 సీజన్‌ 2026లో తమ జట్టుకు హెన్రిచ్‌ క్లాసెప్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని మంగళవారం గల్ఫ్‌ జెయింట్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ లీగ్‌లో క్లాసెన్‌ సారథిగా  అరంగేట్రం చేయడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పవర్‌ హిట్టర్‌గా క్లాసెన్‌ దూసుకుపోతున్నాడు. వివిధ లీగ్‌లలో తన బ్యాటింగ్‌ నైపుణ్యాలతో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న.. క్లాసెన్‌కు కెప్టెన్‌గా మాత్రం చెత్త రికార్డు ఉంది.

చెత్త రికార్డు.. అయినా
అమెరికా వేదికగా మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ (MLC)లో 2024, 2025 సీజన్లలో సీటెల్‌ ఓర్కాస్‌ కెప్టెన్‌గా క్లాసెన్‌ పనిచేశాడు. అతడి సారథ్యంలో ఈ రెండు ఎడిషన్లలో సీటెల్‌ జట్టు పన్నెండు మ్యాచ్‌లు ఆడి పదకొండు ఓడిపోయి.. ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఈ క్రమంలో జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ.. 2025 సీజన్‌ మధ్యలోనే క్లాసెన్‌ కెప్టెన్‌ పదవికి రాజీనామా చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టే క్రమంలో అతడు ఈ నిర్ణయం తీసుకోగా.. జింబాబ్వే దిగ్గజం సికందర్‌ రజా జట్టును ముందుకు నడిపించాడు.

క్లాసెన్‌పై నమ్మకం
కెప్టెన్‌గా క్లాసెన్‌కు మంచి రికార్డు లేకపోయినప్పటికీ గల్ఫ్‌ జెయింట్స్‌పై అతడిపై నమ్మకంతో సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. పవర్‌ హిట్టర్‌గా అతడి బ్యాటింగ్‌ నైపుణ్యాలు జట్టుకు కొత్త ఊపిరిలూదడం ఖాయం. కాగా ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో ఈ సౌతాఫ్రికా స్టార్‌ మొత్తంగా 6900 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

ఇక నవంబరు 21- డిసెంబరు 20 మధ్య ILT20- 2026 టోర్నీకి షెడ్యూల్‌ ఖరారైంది. డీజెర్ట్‌ వైపర్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌, షార్జా వారియర్స్‌, గల్ఫ్‌ జెయింట్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌, అబుదాబి నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ కోసం బరిలో నిలిచాయి.

ఇదీ చదవండి: పృథ్వీ షా విఫలం.. జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement