source: X
క్రికెట్ అభిమానులకు మరో టీ20 టోర్నీ కనువిందు చేసేందుకు సిద్దమైంది. అంతర్జాతీయ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) 2026 సీజన్ షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. ఈ టోర్నీ (ఐదో సీజన్) నవంబర్ 21న ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 20న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
దుబాయ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ డెజర్ట్ వైపర్స్, గత సీజన్ రన్నరప్ ఎంఐ ఎమిరేట్స్ జట్లు తలపడనున్నాయి. డిసెంబర్ 20న జరిగే ఫైనల్‌కు కూడా దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. గత సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ ఆరు జట్లు (డెజర్ట్ వైపర్స్, అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, MI ఎమిరేట్స్, షార్జా వారియర్జ్) బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీలో మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 లేదా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.
🚨 SCHEDULE ANNOUNCEMENT 🚨 It's time to mark your calendars, booking your dates for your favourite team! 🤩 The #DPWorldILT20 Season 5 Schedule is here! 💪 Read more: https://t.co/b8fCvysYcx #AllInForCricket #WhereTheWorldPlays https://t.co/K2UAi4jkhI
— International League T20 (@ILT20Official) October 7, 2026
ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు


