టీమిండియా ప్లేయర్‌ ప్రపంచ రికార్డు | Tanmay Baloda Creates World Record With Best-Ever Match Figures In Youth Test | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆసీస్‌తో మ్యాచ్‌.. టీమిండియా ప్లేయర్‌ ప్రపంచ రికార్డు

Oct 7 2026 3:36 PM | Updated on Oct 7 2026 3:42 PM

Tanmay Baloda Creates World Record With Best-Ever Match Figures In Youth Test

అహ్మదాబాద్ వేదిక‌గా ఆస్ట్రేలియా అండ‌ర్‌-19తో జ‌రిగిన రెండో యూత్ టెస్ట్‌లో భార‌త్ అండ‌ర్‌-19 స్పిన్న‌ర్ తన్మయ్ బలోడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఆఖ‌రి నిమిషంలో రోహిత్ యాద‌వ్ స్ధానంలో జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న త‌న్మ‌య్ త‌న స్పిన్ మాయాజాలంతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లతో ఈ యువ స్పిన్న‌ర్ స‌త్తాచాటాడు. ఈ క్ర‌మంలో త‌న్మ‌య్ ఓ ప్ర‌పంచ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. యూత్ టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా బ‌లోడా నిలిచాడు.

సౌథీ రికార్డ్ బ్రేక్‌
ఇంత‌కుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ లెజెండ‌రీ పేస‌ర్ టిమ్ సౌథీ పేరిట ఉండేది. 2007లో భారత్‌ అండర్‌-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌథీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 92 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 73 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టిన తన్మయ్‌.. సౌథీ 19 ఏళ్ల సౌథీ రికార్డును బ్రేక్‌ చేశాడు. 

కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. పర్యాటక జట్టు బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 151 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ ముందు కేవలం 11 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లలో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement