10 వికెట్ల తేడాతో ఘన విజయం.. భారత్ చేతిలో ఆసీస్ క్లీన్‌స్వీప్
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ను భారత యువ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 10 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసి గెలుపొందింది. అంతకముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో బ్లాక్ కాటిల్ (63) అర్థసెంచరీ సాధించగా, ఎలి బ్రెయిన్ (39) మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ తన్మయ్ బలోడా 8 వికెట్లతో చెలరేగగా, ప్రియాన్షు సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది.వికెట్‌కీపర్ అభిప్రయ్ బిశ్వాస్ (73), కెప్టెన్ యశ్‌బర్దన్ చౌహాన్ (52) అర్థసెంచరీలతో రాణించగా, మనాల్ చౌహాన్ (34), ప్రియాన్షు సింగ్ (30 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్ ఏడు వికెట్లు తీయగా, థామస్ వెసో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 174 పరుగులకే కట్టడి చేశారు. తన్మయ్ బలోడా ఆరు వికెట్ల తీయగా, ఆయాన్ అక్రమ్ 2 వికెట్లు తీశాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లు తీసి అండర్-19 క్రికెట్లో బెస్ట్ ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా భారత అండర్-19 జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.ఇదీ చదవండి: శ్రేయస్ మరో ఘనత.. రోహిత్, కోహ్లి సరసన