7 వికెట్లు తీసిన ఆసీస్‌ బౌలర్‌.. 315 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ | India U19 vs Australia U19 2nd unofficial Test: Ind all out 315 | Sakshi
Sakshi News home page

IND vs AUS: 7 వికెట్లు తీసిన ఆసీస్‌ బౌలర్‌.. 315 పరుగులకు టీమిండియా ఆలౌట్‌

Oct 6 2026 3:07 PM | Updated on Oct 6 2026 3:26 PM

India U19 vs Australia U19 2nd unofficial Test: Ind all out 315

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 తో జ‌రుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భార‌త యువ బ్యాట‌ర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత అండర్‌-19 జట్టు 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 141 పరుగుల మెరుగైన అధిక్యం లభించింది.

కాగా 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా (61 బంతుల్లో 29), కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ అర్ధ శతకం (83 బంతుల్లో 52)తో అదుకున్నారు. అనంతరం మిడిలార్డర్ బ్యాటర్లు మనల్ చౌహాన్(34), ఆర్యన్‌ యాదవ్‌(30), అభిప్రాయ్ బిశ్వాస్(73) కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు.

వీరితో పాటు టెయిలాండర్లు ప్రియాన్ష్‌ సింగ్‌(30), తన్మయ్ బలోడా(28) దూకుడగా ఆడారు. టీమ్‌ మొత్తం సమిష్టంగా రాణించడంతో కంగారులపై భారత్‌ పై చేయి సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో స్పెన్సార్‌ గ్రీన్‌ 7 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు థామస్‌ రెండు వికెట్లు సాధించాడు. 

అంతకుముందు ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. . ఆతిథ్య జట్టు బౌలర్లలో తన్మయ్‌ బలోడా ఆరు వికెట్లతో చెలరేగగా.. అయాన్‌ అక్రం రెండు, మోహిత్‌ ఉల్వా, ప్రియాన్షు సింగ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement