ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ కీలక నిర్ణయం..? | Sam Curran set to miss ILT20 as England eye him to replace Ben Stokes | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ కీలక నిర్ణయం..?

Aug 12 2026 6:09 PM | Updated on Aug 12 2026 6:26 PM

Sam Curran set to miss ILT20 as England eye him to replace Ben Stokes

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ తిరిగి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్దమవుతున్నాడు. పాకిస్తాన్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో కర్రాన్‌కు చోటు దక్కనప్పటికి.. మూడో టెస్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాలని ఈసీబీ సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్థానాన్ని కర్రాన్‌తో భర్తీ చేసేందుకు ఈసీబీ వ్యూహాలు రచిస్తుందంట. 28 ఏళ్ల కర్రాన్ ఇప్పటికే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు రెడ్ బాల్ జట్టులోకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

ఈ క్ర‌మంలో టెస్ట్ క్రికెట్‌పై ఫోక‌స్ పెట్టేందుకు క‌ర్రాన్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్న‌నేష‌న‌ల్ టీ20 లీగ్ 2025-26 సీజ‌న్‌కు దూరంగా ఉండాల‌ని సామ్‌ ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. క‌ర్రాన్ ప్ర‌స్తుతం  డెసర్ట్ వైపర్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అత‌డి సార‌థ్యంలోనే డెసర్ట్ వైపర్స్ గ‌త ఎడిష‌న్ విజేత‌గా నిలిచింది.

కానీ ఈ ఏడాది మాత్రం అంత‌ర్జాతీయ షెడ్యూల్ కార‌ణంగా ఐఎల్‌టీ20కి అత‌డు అందుబాటులో ఉండే సూచ‌నలు క‌నిపించ‌డం లేదు. ఈ టోర్నీ న‌వంబ‌ర్ 26 నుంచి డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇదే స‌మ‌యంలో ఇంగ్లండ్ జ‌ట్టు సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టు ద‌క్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వ‌న్డేల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement