వరుసగా 6 సిక్సర్లు బాదిన మరో ప్లేయర్‌ | England Batter Hits Six Consecutive Sixes But Fails To Enter Elite List Featuring Yuvraj Singh, Gary Sobers | Sakshi
Sakshi News home page

వరుసగా 6 సిక్సర్లు బాదిన మరో ప్లేయర్‌

Aug 10 2026 5:27 PM | Updated on Aug 10 2026 5:56 PM

England Batter Hits Six Consecutive Sixes But Fails To Enter Elite List Featuring Yuvraj Singh, Gary Sobers

source: X

ప్రొఫెషనల్‌ ​క్రికెట్‌లో మరో ప్లేయర్‌ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న వన్డే కప్‌లో హాంప్‌షైర్‌ యువ బ్యాటర్‌ టోబీ ఆల్బర్ట్‌ ఈ ఘనత సాధించాడు. టోబీ వరుసగా ఆరు సిక్సర్లు బాదినా.. హెర్షల్‌ గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, కీరన్‌ పొలార్డ్‌, దీపేంద్ర సింగ్‌ ఐరీ తదితరుల సరసన చేరలేకపోయాడు. వీరంతా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదగా.. టోబీ రెండు వేర్వేరు ఓవర్లలో ఈ ఫీట్‌ సాధించాడు. దీని వల్ల అతడికి గిబ్స్‌, యువీ, పోలార్డ్‌ ఉండే ఎలైట్‌ లిస్ట్‌లో చోటు దక్కలేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టోబీ 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. 43వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన టోబీ.. ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు ఒకే ఓవర్లు కొట్టినవి కానప్పటికీ.. వరుసగా తనెదుర్కొన్న ఆరు బంతుల్లోనే టోబీ ఈ ఫీట్‌ను సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టోబీకి విధ్వంసానికి తోడు ఓపెనర్లు అలిస్టర్‌ ఒర్‌ (105), బెన్‌ మేస్‌ (109) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ససెక్స్‌ సైతం​ పోరాడినప్పటికీ విజయతీరాలు చేరలేకపోయింది. 48.5 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులకే ఆలౌటైంది. చార్లీ టియర్‌ (111), జాక్‌ లీనింగ్‌ (92), డేనియల్‌ ఇబ్రహీం (55) ససెక్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు
- గ్యారీ సోబర్స్‌: దేశవాళీ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు
- రవి శాస్త్రి: దేశవాళీ క్రికెట్‌లో ఆరు సిక్సర్లు
- హెర్షెల్‌ గిబ్స్‌: 2007 వన్డే ప్రపంచకప్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఈ ఘనత
- యువరాజ్‌ సింగ్‌: 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్‌లో ఆరు సిక్సర్లు
- కీరన్‌ పొలార్డ్‌: 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు సిక్సర్లు
- దీపేంద్ర సింగ్‌ ఐరీ: 2024లో వరుసగా ఆరు సిక్సర్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement